అదో బూతు షో..వెంటనే నిలిపేయండి : ‘బిగ్‌బాస్’ షో పై సీపీఐ నారాయణ ఫైర్

‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తెలుగు సీజన్ ఫైవ్ ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మంది అభిమానులున్నారు. ఇక ఈ షో లో కంటెస్టెంట్స్ చేసే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో కి కొత్త చిక్కులు వచ్చాయి.

బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో సిపిఐ నారాయణ విరుచుకుపడ్డారు. అదో బూతుల ప్రపంచమని, వేల కోట్ల రూపాయలకు ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం న్యాయవ్యవస్థ, పోలీసులు తనకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది సమాజంలో విష సంస్కృతిని పెంచేలా ఉందని.. వెంటనే దీనిని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి షోలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తున్నాయని ప్రశ్నించారు. దీనివల్ల ఉపయోగం ఎవరికో చెప్పాలని… బిగ్‌బాస్ షో అంటేనే బూతుల ప్రపంచమని, దీనిని వేల కోట్ల రూపాయల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ షోకు అనుమతి నివ్వడం చాలా ఘోరమైన విషయమన్నారు సిపిఐ నారాయణ.