ఇక డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ… తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం

-

కేంద్ర ప్రభుత్వం మరో నూతన ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాలకు రోడ్ల ద్వారా మందులు సరఫరా చేసే ప్రాజెక్టు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఈ మెడిసిన్ ఫ్రొం ది స్కై ప్రాజెక్టు ను దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ ప్రాజెక్టు ను… కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాసేపటి క్రితమే ప్రారంభం చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు కె టి రామారావు మరియు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ మెడిసిన్ ఫ్రొం ది స్కై ప్రాజెక్టును… తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు ద్వారా పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రహంబెల్ టెలిఫోన్ మరియు రైట్ బ్రదర్స్ విమానం లాగే డోన్ టెక్నాలజీ ఓ సంచలనం అని స్పష్టం చేశారు కేంద్రమంత్రి సింధియా. ఇలాంటి ప్రాజెక్టును అందించడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశయం అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news