Ram Charan: RC 15లో మోహన్ లాల్.. నో చెప్పిన కంప్లీట్ యాక్టర్?

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న RC 15 ఫిల్మ్ గత కొద్ది రోజులుగా మీడియాలో చర్చనీయాంశంగా ఉంటోంది. మూవీ సెట్స్ నుంచి రామ్ చరణ్ ఫొటోలు లీక్ అయ్యాయి. పంచెకట్టులో ఉన్న చరణ్ లుక్ చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ చిత్రంలో ఎక్సలెంట్ గా ఉండబోతున్నదని, చరణ్ ప్రభుత్వ అధికారి, స్టూడెంట్ గా కనబడుతాడని వార్తలొచ్చాయి.

తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ పిక్చర్ లో విలన్ రోల్ కోసం మాలీవుడ్ (మలయాళ) కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ను మూవీ యూనిట్ సభ్యులు సంప్రదించారట. అయితే, తాను విలన్ రోల్ ప్లే చేయబోనని మోహన్ లాల్ నో చెప్పేశారని టాక్. శంకర్ చాలా కాలం నుంచి మోహన్ లాల్ ను డైరెక్ట్ చేయాలని అనుకుంటుండగా, ఈ సారి కూడా ఆయనకు అవకాశం దక్కలేదు.

ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అయితే, ఈ విషయమై మూవీ యూనిట్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఫిల్మ్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఫిల్మ్ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. కీలక పాత్రల్లో శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ అప్ డేట్స్ కోసం మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news