కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో.. 2019 ఏడాదిలో జరిగిన ఫిక్సింగ్ కేసుపై కర్ణాటక ఉన్నత న్యాయ స్థానం ఆసక్తి కరమైన తీర్పును ఇచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ అసలు నేరమే కాదని తీర్పును వెలువరిచింది. 2019 కేపీఎల్ సందర్భంగా పలువురు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కర్నాటక క్రికెట్ సంఘం అధికారుల్లో కొందరు అవినీతికి పాల్పడ్డారంటూ అప్పట్లో బెంగళూరు పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు.
ఈ కేసును తాజాగా విచారించిన కర్ణాటక హై కోర్టు.. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని తేల్చి చెప్పింది. భారత శిక్షా స్మృతి ప్రకారం.. ఫిక్సింగ్ శిక్షార్హం కాదని.. జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ధోషులను శిక్షించడం సంబంధిత క్రీడా బోర్డు పరిధిలోకి వస్తుందని తెలిపింది. నిందితుల పై సెక్షన్ 420 కింద కేసులు కూడా నమోదు చేయడం సరికాదని వెల్లడించింది. చీటింగ్ కేసు వీరికి వర్తించదని పేర్కొంది కోర్టు.