వివాహితను లేవదీసుకొచ్చాడు.. భర్త వెతుక్కుంటూ వచ్చాడు.. చివరికి ఏమైందంటే?

ఆమెకు వివాహమైంది. ఇద్దరు మైనర్ కూతుర్లు కూడా ఉన్నారు. అయినా, మరొకరి సాన్నిహిత్యాన్ని కోరుకుంది. అతడితో కలసి పరారైంది. భార్యను వెతుక్కుంటూ భర్త వచ్చాడు. చివరికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పట్టబట్టడంతో ఆమె ప్రియుడు ఐదేండ్ల అంతస్తు నుంచి దూకడంతో ప్రాణాలను కోల్పోయాడు.

crime

అక్రమ సంబంధం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తాను అక్రమ సంబంధం నేరుపుతున్న మహిళ భర్తకు పట్టబడకుండా ఉండటం కోసం 29 ఏండ్ల యువకుడు ఐదేండ్ల అంతస్తు నుంచి దూకి ప్రాణాలను కోల్పోయాడు.

మృతుడిని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మోషిన్(29)గా పోలీసులు గుర్తించారు. వివాహమైన మహిళతో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ వివాహిత తన ఇద్దరు మైనర్ కూతుర్లతో సహా ప్రియుడితో కలసి ప్రతాప్‌‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు.

రెండేండ్ల క్రితం నైనిటాల్ నుంచి ఆ మహిళను మోషిన్ లెవదీసుకువచ్చాడు. అప్పటి నుంచి భార్య, పిల్లల కోసం భర్త గాలిస్తున్నాడు. చివరికి వారు జైపూర్‌లో ఉంటున్నట్లు కనుగొన్నాడు.

ప్రియుడితో కలసి భార్య ఉంటున్న ప్లాట్‌కు ఆదివారం భర్త చేరుకున్నాడు. అతడిని చూడగానే భయాందోళనకు గురైన మోషిన్, ఐదో అంతస్తులోని ప్లాట్ గది బాల్కనీ నుంచి కిందికి దూకాడు. అతడిని ఎస్ఎంఎస్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయాడు.

కొన్ని రోజుల క్రితమే వివాహిత, మోషిన్ ఎన్‌‌ఆర్‌ఐ సర్కిల్‌‌లోని ప్లాట్‌లోకి మారినట్లు తెలిసింది. అంతకు ముందు పలు ప్రదేశాల్లో నివాసం ఉన్నట్లు సమాచారం.

సంఘటన జరిగిన తర్వాత ఆ మహిళ, ఆమె భర్త పరారీ కాగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మోసిన్ మృతదేహాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.