దేశంలో రోజు రోజుకు క్రైమ్ శాతం పెరిగిపోతోంది. అక్రమ సంబంధాల కారణంగా కొన్ని కేసులు నమోదు అయితే..భూములు, ఇతర కారణాల వల్ల కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి. చిన్న చిన్న కారణాల వల్ల.. హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అయితే.. తాజాగా బలవంతపు పెళ్లిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో బొక్కలగూడాలో భార్య వేధింపులు తట్టుకోలేక ఫిరోజ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి, సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఒక మహిళ తనను బలవంతంగా పెళ్లి చేసుకుందని, పైగా తరచూ వేధింపులకు పాల్పడుతుందని, ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.