ఇప్పుడు మంకీ పాక్స్ అందర్నీ భయపెడుతోంది. ఆగస్టు 9, 2022 తో 32 వేల మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. భారతదేశం మరియు యుఎస్ లో కలిపి ఇంత మంది ఇప్పటికి మంకీ పాక్స్ తో సతమతమవుతున్నారు.
అయితే ఒక మనిషి నుండి మరొకరికి మంకీ పాక్స్ రావడం అనేది అంత సులభం కాదు. స్మాల్ పాక్స్ వైరస్ కుటుంబానికి చెందినది మంకీ పాక్స్ కూడా. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంకీ పాక్స్ సోకడం అంత ఈజీ కాదు.
మంకీ పాక్స్ ఎలా స్ప్రెడ్ అవుతుంది..?
మంకీ పాక్స్ ఉన్న వ్యక్తి దద్దుర్లు కానీ శరీర ద్రవాలను కానీ తాగితే సోకే అవకాశం ఉంది.
లేదంటే మంకీ పాక్స్ ఉన్న వ్యక్తి వాడిన వస్తువులను కానీ ధరించిన దుస్తులను కానీ తాకిన కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది.
మంకీ పాక్స్ పేషెంట్లను కౌగిలించుకున్నా ముద్దు పెట్టుకున్నా లేదంటే లైంగిక సంబంధం ఉన్నా కూడా ఇది సోకే అవకాశం ఉంది.
మంకీ పాక్స్ లక్షణాలు:
మంకీ పాక్స్ ఉన్నట్లయితే జ్వరం, తల నొప్పి, వాపులు ఉండడం, నడుం నొప్పి, అలసట వంటి లక్షణాలు మనం గుర్తించవచ్చు. స్మాల్ పాక్స్ కి వచ్చినట్లు మంకీ పాక్స్ లో కూడా దద్దుర్లు వస్తాయి. ఇవి ఒక్కోసారి శరీరమంతా కూడా రావచ్చు. అయితే ఈ లక్షణాలు పద్నాలుగు రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల్లో బయట పడతాయి. తీవ్రత ఎక్కువగా లేనట్లయితే ఈ లక్షణాలు కనపడక పోవచ్చు. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికి పది మందిలో ఒకరికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
మంకీ పాక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల కి వెళ్లడం మంచిది కాదు.
మంకీ పాక్స్ బారినపడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలి.
పరిశుభ్రత పాటించాలి.