మహబూబ్ నగర్ : కోరిక తీర్చలేదని కోడలి పై 63ఏళ్ల మామ దారుణం…!

అత్తా మామలు తల్లి తండ్రులతో సమానం అంటారు. కానీ ఇక్కడ ఓ మామ కోడలి పాలిట యముడిగా మారాడు. కోరిక తీర్చాలని వెంట పడ్డాడు. ఆమె నిరాకరించడం తో చివరికి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం లోని కురవి మండల కేంద్రం శివారులోని సొమ్లా తండాలో భూక్యా హచ్చ తన కొడుకు భార్య కోడలు రజిత ను ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.

గత కొద్ది రోజులుగా మామ రజితను కోరిక తీర్చమని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని రజిత తన కుటుంబసభ్యులకు చెప్పడం తో వాళ్ళు మమను హెచ్చరించారు. దాంతో కోపం పెంచుకున్న దుర్మార్గుడు కోడలిని హత్య చేశాడు. ఆ సమయంలో రజిత భర్త కూలి పనులకు వెళ్ళగా కూతుళ్లు గురుకులం లో చదువుకుంటున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.