గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్, జగన్ సర్కార్ ల మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను పెంచాలని టాలీవుడ్ పెద్దలు అంటూంటే.. జగన్ సర్కార్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. దీంతో సినిమాలకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో.. అక్కినేని నాగార్జున.. టాలీవుడ్ పరిశ్రమకు షాక్ ఇచ్చాడు.
బంగార్రాజు ప్రమోషన్ మీట్ లో హీరో నాగార్జున సినిమా టికెట్ల రేట్లపై స్పందించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తమ సినిమా కు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించాడు. రేట్లు ఎక్కువగా ఉంటే.. డబ్బు ఎక్కువగా వస్తుందని.. తమ సినిమా వసూళ్లు కొంచెం తగ్గినా పరవాలేదని నాగ్ వివరించారు. రేట్లు పెంచలేదని బంగార్రాజు ను జేబులో పెట్టుకుని.. కూర్చోలేం కదా అని తెలిపాడు. కరోనా కు భయపడట్లేదని.. జనవరి 14 వ తేదీన బంగార్రాజు సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు నాగార్జున. ప్రస్తుతం నాగ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి.