ఆకర్షణలో పడి నేటి యువత పెడదారులు పడుతున్నారు. వారిని చూసి మైనర్లు కూడా దారి తప్పుతున్నారు. తాజాగా నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 8వ తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేశాడు పదవ తరగతి చదువుతున్న బాలుడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బారిక తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం హైదరాబాదులో ఉంటున్నారు.
బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ స్కూల్ కి వెళుతుంది. ఈ క్రమంలో ఇంటి ఎదురుగా ఉండే పదవ తరగతి బాలుడి ఆకర్షణలో పడింది. ఇద్దరి మధ్య సానిహిత్యం శారీరక సంబంధం వరకూ వెళ్ళింది. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఇటీవల బాలిక హైదరాబాదులోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా వారు గుర్తించి నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది బాలిక.
గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు బాలికను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఊరి పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. అయితే బాలుడు తరఫునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.