యూపీలో కుప్పకూలిన 24 ఇళ్లు.. ముగ్గురు దుర్మరణం.. శిథిలాల కింద అనేక మంది..!

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ధర్మశాలలో జరుగుతున్న తవ్వకాల కారణంగా.. ధులియా గంజ్​ ప్రాంతంలో 24 ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందినట్లు సమాచారం. శిథిలాల అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఓ బాలికను సురక్షితంగా కాపాడారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారు..? అందులో ఎంత మంది ప్రాణాలతో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?