కేసీఆర్‌కు తమిళిసై కౌంటర్లు..రాజకీయమేనా?

-

తెలంగాణలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసైల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కేసీఆర్ ఇప్పటికే బీజేపీపై పోరాటం చేస్తున్నారు..బి‌జే‌పిని రాజకీయ శత్రువుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైని బి‌జే‌పి నియమించిన ప్రతినిధిగానే కేసీఆర్ చూస్తున్నారు. ఇదే క్రమంలో గవర్నర్‌కు ప్రోటోకాల్ పాటించడం లాంటివి చేయడం లేదు. దీంతో గవర్నర్ తమిళిసై సైతం కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి చెందిన కొన్ని బిల్లులని పెండింగ్ లో పెట్టేశారు.

దీంతో ఈ వార్ మరింత ముదిరింది..ఇలా కే‌సి‌ఆర్ ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య పోరు నడుస్తోంది. తాజాగా రిపబ్లిక్ వేడుకలు సైతం వారి మధ్య మాటల యుద్ధానికి దారి తీసాయి. తాజాగా రాజ్ భవన్‌లో రిపబ్లిక్ వేడుకలు నిర్వహించిన గవర్నర్..పరోక్షంగా కే‌సి‌ఆర్ పై విమర్శలు గుప్పించారు. అయితే ప్రభుత్వం తరుపున ఈ వేడుకల్లో సీఎస్ శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ పని తీరుపై తమిళిసై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ..కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు- నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి అని, ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదని చెప్పుకొచ్చారు. అలాగే మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదని, రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటి ఉండాలని అన్నారు.

తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతామని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పిన ఆమె… తెలంగాణతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. కొంత మందికి తాను నచ్చక పోవచ్చని..తనకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టమని తెలిపారు. మొత్తానికి పరోక్షంగా కే‌సి‌ఆర్ పై ఆమె విమర్శలు గుప్పించారు. అయితే గవర్నర్ పక్కా రాజకీయం చేస్తున్నారని, బి‌జే‌పి నేతాలు మాదిరిగానే ఆమె మాట్లాడుతున్నారని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. బి‌జే‌పి కోసమే ఆమె పనిచేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి కే‌సి‌ఆర్-గవర్నర్ మధ్య వార్ కొనసాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news