తెల్లవారుజామున ఏడుపు శబ్ధాలు విని లేచిన తల్లి..కూతుర్ని ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా..

ఓ తల్లి తన మూడు సంవత్సరాల కూతురితో కలిసి పడుకుంది…కాని తెల్లవారుజామున మూడుగంటలకు ఏడుపు శబ్ధాలు విని హఠాత్తుగా లేచిన ఆ తల్లి కూతుర్ని చూసి షాకైంది. అసలేం జరిగిందంటే…

crime-in-telangana

మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో థియోంతర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనేహే ప్రాంతానికి చెందిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఓ గుడిసెలో ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆ బాలికి తల్లితో కలిసి పడుకుంది. కానీ కొన్ని గంటలకే ఏడుపు శబ్ధాలు వినిపించటంతో ఆమె నిద్రలేచి చూసే సరికి పక్కన కూతురు లేదు. ఇంటిబయట ఏడుపు శబ్ధాలు రావటంతో భయంభయంగా వెళ్లింది. కూతురు ఉన్నన స్థితిని చూసి నోటమాటరాలేదు. గుండెఆగినంత పనైంది. ఇందుకు కారణం..ఆ పసిబిడ్డను ఓ మృగాడు అపహరించి..అత్యాచారం చేసి అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. వినటానికి చాలా బాధగా ఉన్న ఈ ఘటనతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను ఆసుపత్రిలో చేర్పిచారు. ఇంటికి దగ్గర్లోనే ఉండే ఓ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి రేవా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివ కుమార్ వర్మ మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు. అతడిని విచారిస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం బాధిత బాలిక రేవా పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు దేశంలో ఏదో ఒక మూలు జరుగుతూనే ఉన్నాయి. నిద్రలేచినప్పుటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి మృగాళ్ల చేతుల్లో బలైపోతూనే ఉన్నారు. వయసుతో సంబంధంలేకుండా అత్యాచారాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మత్తు. మద్యం/డ్రగ్స్ మత్తులో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలోకి పోయి కనిపించేది అమ్మాయా, ఆన్టీయా, అమ్మమ్మా, పసిపిల్లా అని తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఘటన జరిగాక నిందితుడ్ని తీసుకొచ్చి స్టేషన్ల్ వేసి శిక్షపడేలా చేసినంతమాత్రానా ఈ ఘోరాలు ఆగవు..సమాజాంలో, చూసే విధానంలో మార్పు వచ్చినప్పుడే ఈ ఘటనలు తగ్గుతాయని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు.