ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని మరో నలుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేయడమే కాక ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి బాధితున్ని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ దృశ్యాలను ఇంటర్నెట్‌లో పెడతామని హెచ్చరించారు. బాధితున్ని భయ పెట్టారు. అతని నుంచి డబ్బులు లాక్కున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ యువకుడు (20) గ్రిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా మరో నలుగురు వ్యక్తులకు పరిచయం అయ్యాడు. అతన్ని వారు ఒక ప్రదేశానికి రప్పించారు. అనంతరం అతనిపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో ఫోన్లతో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. దీంతో భయపడ్డ బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించాడు. అయితే వారు అతన్ని ఆపి డబ్బులు ఇవ్వాలని లేదంటే ఆ దృశ్యాలను బయటకు విడుదల చేస్తామని బెదిరించారు.
ఈ క్రమంలోనే బాధిత యువకుడి నుంచి ఫోన్ పే యాప్ ద్వారా వారు రూ.5వేలను తమ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అయితే అక్కడి నుంచి పారిపోయిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో గౌతమ్, గౌరవ్ అనే ఇద్దరు యువకులు సోదరులు కాగా సచిన్, మోహిత్ అనే మరో ఇద్దరు యువకులు ఉన్నారు. వారు గతంలోనూ ఇలాగే ఓ వ్యక్తి నుంచి రూ.1.80 కోట్లను దోపిడీ చేసేందుకు యత్నించారు. కాగా ఆ బాధిత యువకుడికి చెందిన 12 వీడియో క్లిప్స్‌ను వారి ఫోన్లలో గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.