ప్రవేశాల కోసం అమ్మాయిల ఎర.. చైనా యూనివర్సిటీ నిర్వాకం.

-

చైనాలోని నాంజింగ్ యూనివర్సిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను తక్కువ చేసి చూస్తున్నారన్న ఉద్దేశ్యంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం చేసిన అడ్వర్టైజ్మెంట్ లో మహిళలని కించపరిచారన్న కారణంతో నాంజింగ్ యూనివర్సిటీపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇంతకీ అడ్మిషన్ల కోసం చైనా యూనివర్సిటీ ఏం చేసింది? అది వివాదానికి ఎలా దారి తీసిందనేది చూద్దాం.

యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు, క్యాంపస్ ఆవరణలో నిలబడి తమ చేతుల్లో సైన్ బోర్డులు పట్టుకుని ఉన్నారు. ఆ సైన్ బోర్డుల్లో రాసి ఉన్న అంశాలే వివాదాలకి దారి తీసాయి. నలుగురు పట్టుకున్న సైన్ బోర్డుల్లో వివాదాస్పద అంశాలేమీ లేవు. కానీ ఒక రెండు సైన్ బోర్డులు మాత్రం వివాదంగా ఉన్నాయి. అందులో ఇలా ఉంది. ఒకానొక గర్ల్ స్టూడెంట్ పట్టుకున్న సైన్ బోర్డులో ” ఉదయం నుమ్డి రాత్రి వరకు లైబ్రరీలో నాతో పాటు గడపాలనుందా ” అన్న సందేశం ఉంది.

అలాగే మరో బోర్డులో “నీ యవ్వనంలో నన్ను కూడా భాగం చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా” అన్న సందేశం ఉంది. ఈ రెండు సైన్ బోర్డులే వివాదాన్ని రేకెత్తించాయి. అమ్మాయిల ఫోటోలు పెట్టి ఇలా అడ్వర్టైజ్ చేయడం హీనంగా ఉందని, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఇలాంటి చవకబారు ప్రకటనలు చేయడం బాగాలేదని అంటున్నారు. మరికొందరేమో, ఇది పెద్ద విషయం కాదని, ఇందులో లింగసమానత్వం అనే పెద్ద పెద్ద అంశాలు తీసుకురావద్దని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంతో నాంజింగ్ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ప్రచారమే దొరికిందని మరికొందరు చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news