సిద్దిపేట్ లో దారుణం.. వ‌రి కొనుగోలు కేంద్రం వ‌ద్ద రైతు మృతి

-

సిద్ధిపేట్ జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. వ‌రి కొనుగోలు కేంద్రం వ‌ద్ద కాపాలా ఉంటున్న రైతు గురువారం రాత్రి మ‌ర‌ణించాడు. వ‌రి ధాన్యం కొనుగోలు ఆల‌స్యం కావ‌డం తో ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్దే ఉంటుంది. దీంతో రైతులు ధాన్యం కాపాలా కు అక్క‌డే నిద్రిస్తున్నారు. కాగ అధిక చ‌లి ఉండ‌టం తో పాటు వ‌రి ధాన్యం పై దిగులు తో గుండె పోటు తో మృతి చెందుతున్నారు. గురువారం రాత్రి సిద్ధి పేట జిల్లా నంగునూర్ మండ‌లం బ‌ద్దిప‌డ‌గ లో వ‌డ్లూరి రాములు (45) అనే కౌలు రైతు మృతి చెందాడు.

రాములు 10 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం లో వ‌రి ధాన్యం పోశాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. దీంతో రాములు అక్క‌డే కాపాలా ఉంటుంన్నాడు. కాపాలా కాస్తుండ‌గా వ‌రి ధాన్యం వ‌ద్దే ప్రాణాల‌ను కొల్పోయాడు. కాగ వ‌రి కొనుగోలు కేంద్రం రైతు చ‌నిపోవ‌డం ఇది మూడో సారి. ఈ మ‌ధ్య కాలం లో నే కామారెడ్డి జిల్లా లో ఐలాపూర్ గ్రామం లో బీర‌య్య మృతి చెందాడు. అలాగే వ‌డ్లూర్ ఎల్లా రెడ్డి గ్రామం లో రాజ‌య్య చ‌నిపోయాడు. అలాగే ములుగు జిల్లా లో కూడా కుమార్ అనే రైతు వ‌రి ధాన్యం కొన‌డం లేద‌ని ఆత్మ హ‌త్య చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news