ఏపీని వర్షాలు వీడటం లేదు. వరసగా వాయుగుండాలు, తుఫానులతో కోస్తాంధ్ర, రాయలసీయ అతలాకుతలం అవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రాయలసీమ వరదల్లో తీవ్రంగా నష్టపోయింది. ఇది మరవక ముందే మరో ముప్పు ఏపీకి పొంచి ఉంది. జవాద్ తుఫాన్ రూపంలో ఏపీకి మరోగండం ముంచుకొస్తుంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా బంగాళాఖాతంలో ఏర్పడి.. తీరం వైపు దూసుకొస్తోంది. ఈనెల 4న తీరం దాటే అవకాశం ఉండటం.. ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో ఉత్తరాంధ్ర వాసులు భయం గుప్పిట బతుకుతున్నారు.
తాజాగా జవాద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచనల్లో అధికారులు ఉన్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో నేడు, రేపు స్కుళ్లకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రేపు ఎల్లుండి ఉత్తరాంద్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో జవాద్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో కూడా పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచనల్లో అధికారులు ఉన్నారు.