జర్మనీలో లాక్ డౌన్… ఓమిక్రాన్ నేపథ్యంలో అమలు..

-

ఓమిక్రాన్ ప్రపంచదేశాలను కలవరపరుస్తోంది. తక్కువ వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 30 దేశాల్లో ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. తాజా ఇండియాకు కూడా ఓమిక్రాన్ కేసులు వ్యాపించాయి. ఇండియాలో ప్రస్తుతం 2 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అక్కడ వివిధ దేశాల్లో సగటున రోజుకు 20 వేల కన్నా అధిక కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల ఓమిక్రాన్ కేసులు కూడా గుబులు పుట్టిస్తున్నాయి.

తాజాగా ఓమిక్రాన్ నేపథ్యంలో జర్మనీలో లాక్ డౌన్ విధించారు. షరతులతో  కూడిన లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆదేశం లాక్ డౌన్ బాటపడుతోంది. కాగా వ్యాక్సిన్ తీసుకున్నవారికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకోని వారు మాత్రం ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఆ దేశం. మరో వైపు ఆస్ట్రియా కూడా డిసెంబర్ 11 వరకు లాక్ డౌన్ పొడగించింది. బ్రిటన్, గ్రీస్, డెన్మార్క్, పొర్చుగల్ వంటి దేశాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news