హైదరాబాద్ లో దారుణం..యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు.

ఎవరూ లేని సమయంలో.. యువతిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతికి గాయాలు అయ్యాయి. అయితే.. స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధితురాలు ముషీరాబాద్ కు చెందిన డిగ్రీ చదువుతున్న యువతిగా గుర్తించారు పోలీసులు. నిందితుడు రంజిత్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.