ప్రేమించ లేద‌ని యువ‌కుని పై యాసిడ్ దాడి చేసిన యువ‌తి

విన‌డానికి వింత గా ఉన్న ఇది నిజం. ప్రేమించ లేద‌ని ఒక యువ‌కుని పై యువ‌తి యాసిడ్ దాడి చేసింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రం లో చోటుచేసుకుంది. కేర‌ళ రాష్ట్రం లో ఉన్న షీబా, అరుణ్ సోష‌ల్ మీడియా లో ప‌రిచ‌యం అయ్యారు. ఈ పరిచ‌యం కాస్త ప్రేమ గా మారింది. అయితే షీబా కు ఇప్ప‌టికే పెళ్లి అయింద‌ని.. ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారని అరుణ్ కు తెలిసింది. దీంతో షీబా కు అరుణ్ దూరం గా ఉంన్నాడు. కానీ షీబా మాత్రం అరుణ్ ను పెళ్లి చేసుకోవాల‌ని వెంట ప‌డింది.

అంతే కాకుండా అరుణ్ బ్లాక్ మెయిల్ చేసి రూ. 2 ల‌క్ష‌లను తీసుకుంది. అలాగే త‌న‌నే పెళ్లి చేసుకోవాల‌ని ఇబ్బంది పెట్టింది. దీంతో అర‌ణ్ క‌దలిక‌లను గ‌మ‌నిస్తూ ఉంది. ఒక రోజు అరుణ్ త‌న స్నేహితుల‌తో ఉన్న స‌మ‌యంలో షీబా యాసిడ్ తో దాడి చేసింది. త‌ర్వాత షీబా ప‌రారు అయింది. అనంత‌రం అరుణ్ ను త‌న స్నేహితులు తిరువ‌నంత‌పురం ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. అయితే అరుణ్ కు ఈ యాసిడ్ దాడి లో కంటి చూపు పోయింది. కాగ అరుణ్ పై యాసిడ్ దాడి చేసిన షీబా ను పోలీసులు అరెస్టు చేశారు.