అసెంబ్లీ ఘటనపై చంద్రబాబుకు సోనూసూద్ ఫోన్ !

శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు ఊహించని ఘటన ఎదురైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా వైసిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు పై వ్యక్తిగతంగా మాటల దాడి చేశారు. దీంతో ఆయన ప్రెస్ మీట్ లో నే బోరున విలపించారు. అయితే ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేసింది. అంతేకాదు వైసీపీ తీరుకు వ్యతిరేకంగా నందమూరి ఫ్యామిలీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు కూడా తమ స్థాయిలో స్పందించారు.

అయితే తాజాగా హెల్పింగ్ స్టార్ సోనూసూద్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన ఘటనపై.. చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. శాసన సభలో జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి వైఖరి సరికాదని జగన్ కు చురకలు అంటించారు సోనూసూద్. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబు భరోసా కల్పించారు సోనూసూద్. కాగా ఇవాళ ఉదయం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నారా చంద్రబాబు నాయుడు కు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.