క‌ర్నూల్‌లో విషాదం.. బైక్ చ‌క్రంలో ఇరుక్కొని ప‌సికందు మృతి

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని క‌ర్నూల్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బైక్ చక్రంలో ఇరుక్కుని రెండు నెల‌ల ప‌సికందు మృతి. అయితే.. క‌ర్నూల్ జిల్లాలోని కోడుమూరు మండ‌లం ఎర్ర‌దొడ్డి గ్రామంలో మ‌ల్లికార్జున్, సుహాసిని అనే దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుతూరు, రెండు నెల‌ల బాబు రాముడు ఇద్ద‌రు సంతానం. మ‌ళ్లికార్జున్, సుహాసిని ఇద్ద‌రు కూడా కూలీ ప‌ని చేసుకుంటు జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్నారు.

అయితే రెండు నెల‌ల ప‌సికందుకు జ్వ‌రం రావ‌డంతో ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటి కి వ‌చ్చిన త‌ర్వాత‌.. సుహాసిని బైక్ పై నుంచి దిగుతున్న స‌మ‌యంలో బైక్ ముందుకు క‌దిలింది. అలాగే సుహాసిని చేతిలో ఉన్న ప‌సికందు.. బైక్ వెన‌క చ‌క్రం మ‌ధ్య‌లో ప‌డిపోయాడు. దీంతో ఆ రెండు నెల‌ల ప‌సికందు చ‌క్రంలో ఇరుక్కొన్నాడు. అయితే త‌ల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి ప‌సికందును చ‌క్రం నుంచి బ‌య‌ట‌కు తీశారు. కానీ అప్ప‌టికే ఆ ప‌సికందు మృతి చెందాడు. కాగ రెండు నెల‌ల మాత్ర‌మే నిండిన ప‌సి కందు రాముడు మృతిచెంద‌డంతో త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.