వ‌రి కొనుగోలు కేంద్రంలో మ‌రో రైతుకు గుండె పోటు.. మృతి

-

తెలంగాణ రాష్ట్రం లో వ‌రి కొనుగోలు కేందం లో రైతులు మృతి చెందుతున్న ఘ‌ట‌న లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టి కే కామారెడ్డి , సిద్ధి పేట్ జిల్లా లో రైతుల కు గుండె పోటు వచ్చి మృతి చెందారు. తాజా గా క‌రీంన‌గ‌ర్ జిల్లా లో ఆబాది జ‌మ్మికుంట లో గ‌ల వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రం మ‌రో రైతుకు గుండె పోటు వ‌చ్చింది. దీంతో ఆ రైతు మృతి చెందాడు. వివ‌రాల్లో వెళితే.. ఆబాది జ‌మ్మికుంట లో గ‌ల వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రం లో రైతు బిట్ల ఐల‌య్య వ‌రి ధాన్యం పోశాడు. అయితే గ‌త 15 రోజుల నుంచి వ‌రి తేమ శాతం ఎక్కువ గా ఉంద‌నే నెపం తో వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేయ‌లేదు.

దీంతో రైతు బిట్ల ఐల‌య్య ప్ర‌తి రోజు వ‌రి ధాన్యాన్ని ఆర‌బోస్తు.. ఉండే వాడు. అయితే 15 రోజుల త‌ర్వాత వ‌రి ధాన్యం ఈ రోజు కొనుగోలు చేయ‌డానికి అంగీక‌రించారు. అయితే వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తున్న క్ర‌మం లో రైతు బిట్ల ఐలయ్య కు గుండె పోటు వ‌చ్చింది. అక్క‌డి కక్క‌డే మృతి చెందాడు. దీంతో రైతు కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్లే రైతు మృతి చెందాడ‌ని ఆందోళ‌న చేశారు. పోలీసులు, అధికారులు వ‌చ్చి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news