మమతకు షాక్ ఇచ్చిన శివసేన.. కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యం కాదంటూ వ్యాఖ్యలు

-

త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి శివసేన షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ లేకుండా విపక్ష కూటమి సాధ్యం కాదంటూ శివసేన పార్టీ కీలక నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్  కీలక వ్యాఖ్యలు చేశారు.2024 తో రాహుల్ గాంధీ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని వ్యాఖ్యలు చేశారు.  రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షాలకు నేతృత్వం వహించాలని అనుకుంటున్న మమతా బెనర్జీకి పరోక్షంగా షాక్ ఇచ్చినట్లే.

ఇటీవల త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, దేశంలోని ప్రతిపక్షాలను కలుపుకుని కొత్త కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇందుకోసం ఇటీవల ముంబైకి వెళ్లి శివసేన పార్టీ నేతలైన ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ తో పాటు ఎన్సీబీ నేత శరద్ పవార్ లతో సమావేశం అయింది. అయితే సమావేశం అనంతరం దీదీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో యూపీఏ ఎక్కడ ఉందంటూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాతి రోజే త్రుణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. విపక్షాలకు సారధ్యం వహించడం దేవుని వరంగా ఫీల్ అవుతుందనే వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు త్రుణమూల్ నేతృత్వం వహించాలని చూస్తున్ తరుణంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు మమతా బెనర్జీకి మింగుడుపడకుండాఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news