ఏపీలో దారుణం.. మహిళపై హత్యాయత్నం..!

-

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ అవి ఆచరణకు నోచుకోవడం లేదు. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కర్నూలు జిల్లా లోని ఓర్వకల్లు (మం) నన్నూరు రాగ మయూరిలో ఈ ఘటన జరిగింది.

గౌసియా భాను అనే మహిళను తలపై బండరాయితో మోదీ హత్యాయత్నం చేశాడు క్రాంతి స్వరూప్.  నన్నూరు రాహ్మ్గమయూరి కాలనీలో నివాసముంటున్నారు క్రాంతి స్వరూప్, గౌసియా బాను. గత కొంతకాలంగా భర్త వదిలేయడంతో తల్లితో ఉంటున్న గౌసియా భాను అదే కాలనీ లో భార్యతో కలిసి ఉంటున్నారు క్రాంతి స్వరూప్. గత మూడేళ్ళుగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అయితే ఇద్దరి మధ్య విబేధాలతో గొడవలు జరిగాయి. ముఖ్యంగా తనను టార్చర్ చేస్తుందంటూ బండరాయితో మోది గౌసియాను హత్యకు ప్రయత్నించాడు క్రాంతి స్వరూప్. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. కర్నూలు లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news