కడప జిల్లాలో దారుణం.. అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి కొట్టి చంపిన వైనం !

-

అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కడప జిల్లాలో అభం – శుభం తెలియని పదేళ్ల బాలుడిని స్వయానా మేనత్త, మేన మామ కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్​ జిల్లాలోని ఓంశాంతి నగర్​కు చెందిన శివయ్య, భాగ్యమ్మ అనే భార్యాభర్తలు.. నెల రోజుల క్రిందట జీవనోపాధి కోసమని గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తమ పదేళ్ల కొడుకైన అయాన్​ను బాలుడి మేనత్త ఇంట్లో వదిలిపెట్టి వెళ్లారు.

అయితే బాలుడు అల్లరి చేస్తున్నాడని విసుగు చెందిన అతని మేనత్త.. అయాన్​ తొడ వద్ద కాల్చారు. దాంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గమనించిన బంధువులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు’ అని వెల్లడించారు. అప్పటికే బాలుడు మేనత్త, మామ పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బాలుడి మేనత్త, మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version