హైదరాబాద్‌ లో దారుణం..3 రోజులుగా తల్లి శవంతో ఫ్లాట్లోనే కొడుకు

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. 3 రోజులుగా తల్లి శవంతో ఫ్లాట్లోనే కొడుకు ఉన్న సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పూరి కాలనీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. మైత్రి నివాస్ అపార్టుమెంట్ లోని 202 నెంబర్ ఫ్లాట్ లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృత దేహం వెలుగు చూసింది.

అయితే… తల్లి మృత దేహం తో మూడు రోజులుగా ఫ్లాట్లోనే ఆమె కుమారుడు సాయి కృష్ణ ఉన్నాడు. సాయికృష్ణ కు మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటున్న అపార్ట్మెంట్ వాసులు.. తల్లి, కొడుకులు తరుచూ గొడవ పడేవారని చెబుతున్నారు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అపార్ట్‌ మెంట్‌ వాసులు. అందుకు తల్లి మృత దేహం తో మూడు రోజులుగా ఫ్లాట్లోనే ఆమె కుమారుడు సాయి కృష్ణ ఉన్నాడని వెల్లడిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు.