శ్రీలంకలో రచ్చ రచ్చ.. రాజపక్స అరెస్టుకు రంగం సిద్ధం..

-

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. తాజాగా శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారుపై దాడులు చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స అరెస్టుకు రంగం సిద్ధమైంది. మహిందతోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక కోర్టు సీఐడీకి ఆదేశించింది.

దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభానికి బాధ్యతవహిస్తూ రాజీనామా చేయాలని ప్రధాని నివాసం వెలుపల దాడులు జరిగినట్లు అటార్నీ సెనక పెరీరా అనే వ్యక్తి కొలంబో మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. మహింద మద్దతుదారులే ఈ దాడులకు తెగబడినట్లు అందులో ఆరోపించారు. దీనిపై రాజపక్సతోపాటు పార్లమెంటు సభ్యులు జాన్స్‌టన్‌ ఫెర్నాండో, సంజీవ ఎదిరిమన్నె, సనత్‌ నిశాంత, మొరాటువా మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సమన్‌ లాల్‌ ఫెర్నాండో, సీనియర్‌ పోలీసు అధికారులు దేశబందు తెన్నకూన్‌, చందనా విక్రమరత్నను తక్షణమే అరెస్టు చేయాలని పిటీషనర్‌ కోరారని శ్రీలంక మీడియా పేర్కొన్నది.

Read more RELATED
Recommended to you

Latest news