యూపీ లో దారుణం.. పోలీసు ప‌రీక్ష రాసి వ‌స్తుండ‌గా

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో దారుణం చోటు చేసుకుంది. పోలీసు ప‌రీక్ష రాసి వ‌స్తున్న యువ‌తి పై కొంత మంది దుండ‌గులు న‌డుస్తున్న‌ కారు లో సామూహిక అత్యాచారం జ‌రిపారు. యూపీ లోని కోసిక‌ల‌న్ ప్రాంతానికి చెందిన ఒక యువ‌తి సోష‌ల్ మీడియా ద్వారా ఒక యువ‌కుడు ప‌రిచ‌యం అయ్యాడు. యువ‌తి అత‌ని తో స్నేహం చేసింది.

అయితే యువ‌తి కి ఆగ్ర లో పోలీసు నియామ‌క ప‌రీక్ష ఉండ‌టం తో యువ‌కుని కారు లో వెళ్లింది. ప‌రీక్ష కు వెళ్లే స‌మ‌యంలో డ్రైవ‌ర్ ఒక్క‌డే ఉండ‌గా.. యువ‌తి ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత మ‌రో నలుగురు యువ‌కులు వ‌చ్చారు. యువ‌తి స్నేహితుని తో పాటు మ‌రో న‌లుగురు న‌డుస్తున్న కారు లోనే సామూహిక అత్యాచారం చేశారు. అనంత‌రం ఆ యువ‌తి ని రోడ్డు పై వ‌దిలేశారు. బాధిత యువ‌తి ని గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. బాధిత యువ‌తి సోద‌రుని ఫీర్యాదు తో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.