చిరుత పులి రోడ్డు దాడుతుండగా.. ఓ బైకర్ వేగంగా వచ్చి దానిని ఢీకొట్టాడు. ఈ ఘటన కేరళ – తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని నడుకాని మరపాలెం వద్ద చోటుచేసుకుంది. బైక్ ఢీకొనడంతో చిరుతపులి కాసేపు రోడ్డుపై అలాగే అచేతన స్థితిలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో చిరుత పులి గాయపడినట్లు సమాచారం. కొంతసేపటికే చిరుత సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. కాగా, చిరుత పులి రోడ్డుపై పడిపోయి ఉన్నది చూసి వాహనదారులు అటుగా వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.