నేరాలకు కేరాఫ్ ఉత్తరప్రదేశ్

-

నేరాలకు అడ్డగా భాజపా పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కేంద్రంగా మారింది. ఆడ పిలల్లపై అఘాయిత్యాలు నిత్యకృత్యాలుగా జరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కువగా మహిళలు, బాలికలపై అత్యాచార కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే ఆత్మీయుల ప్రాణాలను తీసేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్న ఘటన హాథ్రస్‌ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.

అత్యాచారం
అత్యాచారం

బెదిరింపులకు లొంగకపోవటంతోనే..
సోమవారం ఉదయం అంబ్రిశ్ శర్మ కుమార్తె (బాధితురాలు) గుడికి వెళ్లింది. అదే సమయంలో నిందితుడు గౌరవ్ శర్మ భార్య, అత్త కూడా వచ్చారు. తనపై కేసు పెట్టిన బాలికను చూసి గౌరవ్ కుటుంబసభ్యులు వారితో గొడవ పడ్డారు. ఇదే సమయంలో అంబ్రిశ్ కూడా గుడికి వచ్చారు. కేసు వెనక్కి తీసుకోవాలని గౌరవ్ అంబ్రిశ్‌ను బెదిరించాడు. బాధిత కుటుంబం ససేమిరా అనటంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గుడి నుంచి వచ్చిన అంబ్రిశ్ కుటుంబం పొలంలో పనులు చేసుకుంటూ ఉన్న సమయంలో కారులో గౌరవ్ కొందరు కుటుంబ సభ్యులతో వచ్చారు. అంబ్రిశ్‌ను కాల్చి పారిపోయాడు. ఘటనకు సంబంధించి గౌరవ్‌ శర్మ, లలిత్‌ శర్మ, రహితేశ్‌ శర్మ, నిఖిల్‌ శర్మతో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు హాథ్రస్‌ ఎస్పీ వినీత్‌ జైస్వాల్‌ తెలిపారు. లలిత్‌ను అరెస్టు చేసినట్టు, ప్రధాన నిందితుడు గౌరవ్‌ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. అంబ్రిశ్‌ను ఆసుపత్రికి తరలించే క్రమంలోనే చనిపోయాడు.

రాజకీయ రంగు..
నిందుతుడిని వెంటనే శిక్షించాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. యూపీ సర్కారు తమకు న్యాయం చేస్తుందే నమ్మకం ఇక్కడి మహిళల్లో ఎప్పుడో పోయిందని ఎస్పీ అధ్యక్షుడు విమర్శించారు. అయితే నిందితుడు గౌరవ్ ఎస్పీ నాయకుడని బీజేపీ ప్రతినిధి మనీశ్ శుక్లా ఆరోపించారు. అన్యాయంగా తన తండ్రిని చంపారని తమకు న్యాయం చేయాలని బాధితురాలు వీడియోలో పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలోనే యూపీలో ఏడుగురు యువతులపై అత్యాచారం చేసి హత్యచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news