పోలవరం… జగన్ దక్షతకు నిదర్శనం.. సాకారానికి చేరువలో ప్రాజెక్ట్‌

-

దూరదృష్టి. . . . బలమైన నాయకత్వ లక్షణాలు… పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా అందుకోవచ్చు.ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే సమస్యలను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. చేస్తున్న పని పట్ల స్పష్టత ఉంటే పనులు చకచకా సాగిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పోలవరం ప్రాజెక్టు సాకారమవుతున్న రాష్ర్ట ప్రజానీకంలో మెదలుతున్న మాటలు ఇవి. పనులు చకచకా సాగుతున్న వేళ పోలవరం నిర్మాణం పరుగులు పెడుతోంది. అచ్చమైన స్వచ్ఛమైన గోదావరి పరుగులా జగన్‌ సమక్షంలో పోలవరం ప్రాజెక్టు ఒక రూపు సంతరించుకుంటోంది.

కోట్లాది మంది ప్రజల ఆశలకు,సీఎం జగన్‌ నిబద్ధతకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది ఈ ప్రాజెక్ట్‌. బృహత్తరమైన ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కొనసాగుతుంది తప్ప తుది రూపు దాల్చ లేదు.మహానేత నిర్యాణం అనంతరం పాలకుల నిర్లక్ష్యం,అంచనా వ్యయం పెంచేసి దోపిడీ చేసిన కారణంగా ప్రాజెక్ట్ ఫలాలు ప్రజలకు అందలేదు.సీఎం జగన్‌ అధికారం చేపట్టాక బహుళార్ధక ఈ ప్రాజెక్టును ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలుసుకుంటూ కేంద్రం నుంచి నిధులు రాబడుతూ తన తండ్రి కల సాకారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే

ఈ ప్రాజెక్ట్‌ పూర్తియతే ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది.ఉభయ గోదావరి జిల్లాలో 10 లక్షలు, కృష్ణ జిల్లాలో మరో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకుంటుంది.పోలవరం నుంచి విశాఖపట్నం వరకు 182 కి. మీ ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగు నీరు,172 కి.మీ పొడవున్న కుడి కాలువ ద్వారా విజయవాడ వరకు మరో 3.20 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు సరఫరా చేయవచ్చు.పోలవరం రిజర్వాయర్ లో భారీగా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.

మెట్ట ప్రాంతంలో 540 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు వీలుంటుంది.బాబు జగజ్జీవన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 3 జిల్లాలకు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉంది.ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు సమీపంలో చంద్రబాబు పట్టిసీమ ఎత్తి పోతల పథకానికి రూపకల్పన చేసి లక్ష్యాలకు తూట్లు పొడిచారు.బృహత్తరమైన పోలవరాన్ని వదిలేసి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరేలా పట్టి సీమను పూర్తి చేయడానికి బాబు ఆసక్తి చూపించారు.ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయింపు చేయలేదు.. వాటి కోసం ఎటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.పట్టిసీమ మూలంగా 70 టీఎంసీల నీరు కృష్ణ జిల్లాకు వెళ్తుంది.అదే పోలవరం పూర్తయితే 80 టీఎంసీల నీరు వెళ్తుంది.

టిడిపి శాపం నుండి పోలవరం ప్రాజెక్టుకి విముక్తి కల్పించారు సీఎం వైఎస్ జగన్.2013-14 ధరల ప్రకారం ఐతే రావాల్సింది రూ. 1249 కోట్లే.అయితే సీఎం జగన్ సమర్థతతో కేంద్రం నుంచి 12,911 కోట్లు సాధించారు.ఇటీవల మరో రూ. 10000 కోట్లు అడిగిన సీఎం వైయస్ జగన్ అభ్యర్ధన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారు. ఎన్నెన్నో అవాంతరాలు దాటుకుని పోలవరం ప్రాజెక్టు సాకారమవుతోంది. మహానేత వైఎస్‌ఆర్‌ చూపిన దారి మరచిపోకుండా ఆయనిచ్చిన స్ఫూర్తి ఆలంబనగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలంవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు.ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని చెప్పిన సీఎం వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన ఎల్లో మీడియా మన రాష్ట్రంలో ఉందని అసహనం వ్యక్తపరిచారు.కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతిందని చెప్పిన ఆయన…. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. దీంతో రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇలాంటివి ఎల్లో మీడియాకు కనిపించవా అని ప్రశ్నించారు.

కీలక పనుల్లో గణనీయ ప్రగతి:

పోలవరం ప్రాజెక్టు కీలక పనుల్లోని ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు.స్పిల్‌వే కాంక్రీట్ పనులు,48 రేడియల్‌ గేట్ల ఏర్పాట్లు,రివర్‌ స్లూయిస్‌ గేట్ల ఏర్పాటు,ఎగువ కాఫర్‌ డ్యాం,దిగువ కాఫర్‌డ్యాం నిర్మాణం కూడా పూర్తయిందన్నారు.గ్యాప్‌-3 వద్ కాంక్రీట్‌ డ్యాం,పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం,అప్రోచ్‌ ఛానల్‌ పనులు పూర్తికావొచ్చిందని,
ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్‌-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు.ఈసీఆర్‌ఫ్‌ గ్యాప్‌-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా కూడా పూర్తయ్యిందన్నారు.నిర్వాసిత కుటుంబాల్లో 12,658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని తెలిపారు అధికారులు.

డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి: సీఎం

దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు సీఎం జగన్‌.ఇది పూర్తైతే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్న సీఎం,
డిసెంబర్‌ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకెళ్ళాలని సూచించారు.నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా చర్చించిన సీఎం,…కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా సౌకర్యాలను కూడా కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.షెడ్యూలు ప్రకారం…, నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని చెప్పారు.

పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలి:

పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు.పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్న సీఎం,… పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్‌ ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని చెప్పారు.మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news