13 మంది విద్యార్థులను రేప్ చేసిన ప్రిన్సిపల్ కు జీవిత ఖైదు వేసిన న్యాయస్థానం

-

పిల్లలకు విద్య చెప్పి..వారి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంత మంచి స్థానం ఒక్క టీచర్ కే ఉంటుంది. కానీ ఈరోజుల్లో టీచర్లలో కొందరు కీచుకులుగా తయారవతున్నారు. మానవ రూపంలో మృగంలా మారి..వారి పసి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఓ ప్రిన్సిపల్ ఏకంగా 13 మంది విద్యార్థులపై అత్యాచారం చేశాడు. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2016 నుంచి 2021 మధ్య కాలంలో 11-14 ఏళ్ల వయస్సున్న కనీసం 13 మంది బాలికలపై ఇండోనేషియా పశ్చిమ జావాలోని బాండుంగ్‌ నగరంలో ఓ ఇస్లామిక్‌ బోర్డింగ్ పాఠశాలలో ప్రిన్సిపల్‌ హెర్రీ విరావాన్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాఠశాలలోనే కాకుండా బయట హోటల్‌ గదులు, అద్దె అపార్టమెంట్‌లలో వారిని బెదిరించి అఘాయిత్యం చేసినట్టు నేరారోపణలు వచ్చాయి.. అతడు చేసిన పాపానికి ఎనిమిది మంది శిశువులు కూడా పుట్టారట. ఇంకా అనేకమంది బాధితులు పోలీసు కేసులతో మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భయంతో ఫిర్యాదు చేయడంలేదని పోలీసులు అంటున్నారు.

ఓ బాధితురాలు సెలవులకు ఇంటికి వచ్చి ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో చేరి బిడ్డకు జన్మినివ్వడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పశ్చిమ జావా పోలీసులు గతేడాది మే నెలలోనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాలను అంగీకరించడంతో పాటు బాధిత విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.

అయితే, ఈ వ్యవహారంపై గత నవంబర్‌లో కోర్టులో విచారణ ప్రారంభమయ్యేంత వరకు కేసు సమాచారాన్ని పోలీసులు బయటకు రానివ్వలేదు. బాధితులకు మానసికంగా, సామాజికంగా జరిగే నష్టాన్ని నివారించేందుకే తాము ఈ విషయాన్ని బయటపెట్టలేదని పోలీసులు అంటున్నారు.

బాండుంగ్‌ జిల్లా కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానల్‌ నిందితుడిని దోషిగా తేల్చేసింది. అతడికి జీవిత ఖైదు విధించింది. బాధితులకు 23,200 డాలర్లు పరిహారం ఇవ్వాలని మహిళా సాధికారత, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. వీటిలో ఒక్కో బాలిక వైద్య, మానసిక చికిత్స కోసం 600 నుంచి 6వేల డాలర్లు ఇవ్వాలని తెలిపింది.

నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలు జన్మనిచ్చిన శిశువులను మహిళా శిశు సంరక్షణ ఏజెన్సీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఆ బాలికలు శిశువుల్ని పెంచగలమనే మానసిక సంసిద్ధత వ్యక్తంచేసే వరకు వారి సంరక్షణలోనే ఉంచాలని తెలపింది. అయితే, 13మంది విద్యార్థినుల జీవితాల్ని నాశనం చేసిన నిందితుడికి మరణశిక్షతో పాటు లైంగిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేలా తీర్పు ఇవ్వాలని న్యాయవాదులు కోరగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. మరోవైపు, ఈ తీర్పును ఎగువ కోర్టులో అప్పీల్‌ చేసుకోవాలా, వద్దా అనే అంశంపై ఆలోచిస్తున్నట్టు నిందితుడి తరఫు న్యాయవాదులు తెలిపారు.

అంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన అలాంటి వారికి జీవితఖైదు వేస్తేమాత్రం ఏం ఉపయోగం.. ఉరిశిక్ష వేస్తేనే.. ఇలాంటి వారికి బుద్ది వస్తుంది. అసలు ముందు అమ్మాయిల్లో భయం పోవాలి. ఎంతమాత్రం బెదిరించానా.. అమ్మాయిలు అలా ఎలా అతని బెదిరింపులకు లొంగిపోయారు అనేది ప్రశ్నే. పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉంటే..ఎలాంటి విషయాన్ని అయినా.. ఓపెన్ గా చెప్పేస్తారు.. మనం విలన్ లా ప్రవర్తిస్తే.. వాలు దాచటం మొదలుపెడతారు.

ఈరోజుల్లో మీకు( తల్లిదండ్రులు)మీ బిడ్డల గురించి తెలియని ఎన్నో విషయాలు వారి ఫ్రెండ్స్ కు తెలుస్తున్నాయని తెలుసా.. వాళ్లు మీకు చెప్పేలని ఎంతో భాదను దోస్తులతో షేర్ చేసుకుని ఏడుస్తారు.. పిల్లలకు ఊహవచ్చినప్పిటినుంచే.. వారిని ప్రేమతో దగ్గరకు తీసుకుంటూ.. అన్ని విషయాలపై అవగాహన ఇస్తూ..ధైర్యాన్ని నింపాలి.. దేనికి, ఎవడికి భయపడొద్దనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలంటున్నారు నిపుణలు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news