ఇండియాలో కొత్తగా 11,903 కేసులు..311 మరణాలు

-

మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభన ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఓరోజు కరోనా కేసులు పెరుగుతూ…. మరో రోజు తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… దేశంలో మరోసారి కరుణ కేసులు పెరిగాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా.. 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,51,209 కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంత తక్కువగా చేరడం.. గడిచిన 252 రోజుల తర్వాత ఇదే కావడం విశేషం. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.16 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 311 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14,159 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,97,740 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 1,07,29,66,315 కు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 41,16,230 మందికి కరోనా టీకా వేయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version