పెప్సీ ఆశ చూపి 8 ఏళ్ల బాలికపై 60 ఏళ్ళ వృద్ధుడి లైంగిక దాడి !

పెప్సీ ఆశ చూపి ఎనిమిది సంవత్సరాల బాలికపై 60 ఏళ్ళ వృద్ధుడి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ధారవి లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధారవి ఏరియాలో గత కొన్ని ఏళ్లుగా వీరేష్ అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. వీరేష్ కు 60 ఏళ్ళు దాటింది. అయితే వీరేష్ ఇప్పటికే పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన ఇంటి పక్కనే ఉన్న ఓ బాలికపై కన్ను పడింది. దీంతో ఆ బాలికకు పెప్సీ ఆశ చూపి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు వీరేష్.

ఇలా పలు సార్లు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ ఎనిమిదేళ్ల పాపకి కడుపునొప్పి రావడంతో అసలు విషయం బయట పడింది. దీంతో తల్లిదండ్రులు ఆ వృద్ధుడిని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వృద్ధుడిని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి..అరెస్టు చేశారు.