టీవీ9 మాజీ సీఈవోకు లా ట్రైబ్యునల్‌ షాక్‌.. 10 లక్షలు జరిమానా

-

పలు ఆర్థిక వ్యవహారాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసిన జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ రూ. 10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ నిన్న తీర్పు వెలువరించింది.

Yet Another Case Filed on Former TV 9 CEO Ravi Prakash in Hyderabad

అంతేకాకుండా టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తేల్చి చెప్పింది జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్. వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్ చేసిన చర్యలు అనైతికమని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ పేర్కొంది. వాటాల విక్రయ ఒప్పందం గురించి ఆయనకు కూడా తెలిసే జరిగిందని, అందులో ఆయన కూడా భాగమేనని పేర్కొంటూ.. ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news