బంజారాహిల్స్ చిన్నారి రేప్ కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

-

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో అరెస్టయిన డ్రైవర్‌, పాఠశాల ప్రిన్సిపల్‌ మాధవిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని లోతుగా ప్రశ్నించనున్నారు. పాఠశాల డ్రైవర్‌కు ఈ ఘటనలో ఎవరు సహకరించారు అనే కోణంలో విచారణ సాగనున్నట్లు సమాచారం. కస్టడీలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సి ఉంది.

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్​ రజినీ కుమార్ నేర చరిత్ర గురించి పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించారు. అతను మరికొంతమంది విద్యార్థినిలతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు  అనుమానిస్తున్నారు. రజినీ కుమార్ మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్నాడు. అతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

11 ఏళ్లుగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ మాధవి దగ్గర కారు డ్రైవర్​గా పనిచేస్తున్న రజినీ కుమార్.. ఇతర ఉపాధ్యాయుల వద్ద ఆజమాయిషీ చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు. ప్రిన్సిపల్ వద్ద ఉండే వ్యక్తి కావడంతో ఇతర ఉపాధ్యాయులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. దీన్ని అదనుగా తీసుకొని చిన్నారుల తరగతి గదుల్లోకి వెళ్లడం.. పిల్లల్ని డిజిటల్ క్లాస్ రూమ్​లోకి తీసుకెళ్లడం లాంటివి చేసేవాడు. ఈ క్రమంలోనే 4 ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news