శృంగారంలో ఈ నియమాల గురించి తప్పక తెలుసుకోవాలి..

-

ఒకప్పుడు శృంగారం అంటే చాలా మంది తప్పుగా భావించేవారు..కానీ ఇప్పుడు మాత్రం అది కామన్ అయిపోయింది..ఇప్పటి డిజిటల్ యుగంలో కూడా అనేక మందికి ఆ కార్యంపై అంతగా అవగాహన లేదు. అయితే పూర్వకాలంలో మాత్రం రొమాన్స్ గురించి, ముఖ్యంగా కామసూత్రాల్లోని భంగిమల గురించి ఓపెన్ గానే మాట్లాడేవారట..అందుకే శృంగారం అనే అంశాన్నే వాత్సాయనుడు ప్రధానంశంగా తీసుకునొ ‘కామ సూత్ర’ అనే పుస్తకాన్ని రెండో శతాబ్దంలో రాశాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇలాంటి గ్రంథాల్లోని అద్భుతమైన భంగిమలు, సూచనల మేరకు శృంగారంలో పాల్గొంటే మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు అంటున్నారు..

శృంగారంలో పాల్గొనక ముందు తమ జననాంగాలను పూర్తిగా శుభ్రం చేసుకోవాలని కామసూత్ర గ్రంథం చెబుతోంది. ఆ తర్వాతే శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే పూర్వ కాలంలో శృంగారంలో పాల్గొనడానికి ముందు స్నానం కచ్చితంగా చేయాలనే నిబంధనను పెట్టారు. దాన్ని కచ్చితంగా ఆచరించేవారు. పూర్తిగా నగ్నంగా మారి ఆ కార్యంలో పాల్గొనకూడదట. స్త్రీపురుషులిద్దరూ తమ శరీరంపై కనీసం దుప్పటినైనా కప్పుకోవాలి..

శృంగారంలో పాల్గొనే వారు ఎక్కువగా రాత్రి వేళలో పాల్గొనాలట. అయితే అర్థరాత్రిలోపు ముగించాలట. ఎవరైతే అర్ధరాత్రి ఆ కార్యాన్ని చేస్తారో.. అది రాక్షసుల క్రీడగా పరిగణించబడుతుందట. ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే పుట్టే పిల్లల్లో రాక్షస లక్షణలు ఎక్కువగా వస్తాయట..శృంగారంలో పాల్గొనడానికి ముందు మీ భాగస్వామి కూడా అందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉందా లేదా అనేది కచ్చితంగా చూసుకోవాలి. తనకు ఇష్టం లేనప్పుడు లేదా వారు బాధలో ఉన్నప్పుడు ఆ కార్యంలో బలవంతంగా పాల్గొనరాదు. ఇలా చేయడం వల్ల చాలా పెద్ద నేరంగా పరిగణించబడుతుందట. పీరియడ్స్ సమయంలో కూడా కలయికలో పాల్గొనకూడదు. ఒక వేళ బలవంతంగా పాల్గొంటే మగాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. అయితే పీరియడ్స్ పూర్తయిన 4 రోజుల తర్వాత అంటే ఐదో రోజు నుండి ఆ కార్యంలో పాల్గొనవచ్చు..ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news