ఢిల్లీ జహంగీర్ పురి అల్లర్ల కేసులో 20 మంది అరెస్ట్

-

హనుమాన్ జయంతి సందర్భంగా శోభా యాత్రపై నిన్న ఢిల్లీలోని జహంగీర్ పురి ఏరియాలో దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులతో సహా కొంతమంది గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జహంగీర్ పురి ఏరియాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉంటే అల్లర్లకు కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు బాల నేరస్థులు కూడా ఉన్నారు. నిందితుల నుంచి మూడు మారణాయుధాలు, 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్న జరిగిన అల్లర్లలో మిగతా నిందితుల కోసం సీసీ కెమెరా పుటేజీని పరిశీస్తున్నారు.

రోహిణి కోర్ట్ లో నిందితులను ప్రవేశపెట్టారు. ఇద్దరు నిందితులు అన్సార్, అస్లామ్ లను ఒక రోజు పోలీస్ కస్టడీకి అప్పగించారు. 147,148,149,186,353,332,323,427, 436,307,120B IPC, 27 ఆయుధాల చట్టం సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కోర్ట్ ఇద్దరిని పోలీస్ కస్టడీకి ఇవ్వగా….12 మందికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version