IPL CSK vs GT : మ‌రో గెలుపుపై చెన్నై క‌న్ను.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజ‌రాత్

-

ఐపీఎల్ 2022 డ‌బుల్ ధ‌మాకా లో భాగంగా నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగ ఈ మ్యాచ్ లో కీల‌క‌మైన టాస్ ను గుజరాత్ టైటాన్స్ గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌షీద్ ఖాన్ తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ర‌వీంద్ర జ‌డేజా సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. వ‌రుస ఓట‌మిల త‌ర్వాత.. చెన్నై.. బెంగ‌ళూర్ పై గెలిచి ఆత్మ విశ్వాసంతో ఈ మ్యాచ్ ఆడుతుంది.

కాగ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానంలో ఉన్న గుజ‌రాత్.. మ‌రో గెలుపుపై ప్లాన్స్ ర‌చిస్తుంది. కాగ ఈ మ్యాచ్ లో గాయం కార‌ణంగా హార్ధిక్ పాండ్యా ఆడ‌టం లేదు. త‌ర్వాతి మ్యాచ్ కు అందుబాటులో ఉండ‌నున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జ‌ట్టు :
రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు :
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీప‌ర్), శుభమాన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

Read more RELATED
Recommended to you

Exit mobile version