పీకలదాకా మద్యం సేవించి.. పామును ముక్కలుగా కొరికి పడేశాడు..!

1094

ఆ వ్యక్తి తనను పాము కాటేసిందని తెలిసినా.. దాన్ని అతను పట్టుకుని ముక్కలు ముక్కలుగా బ్రెడ్డును కొరికినట్టు కొరికాడు.  అతనిప్పుడు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో ఉన్నాడు.

పాములను చూస్తే సహజంగానే ఎవరికైనా భయం కలుగుతుంది. విషం ఉన్న.. లేని.. పాము ఏదైనా సరే.. దాన్ని చూస్తేనే చాలా మందికి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తుంది. ఇక బాగా విషం ఉండే పాములైతే వాటి దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసం చేయరు. ఈ క్రమంలోనే మనలో కొందరికి పాములంటే విపరీతమైన భయం కూడా ఉంటుంది. కనీసం వాటి గురించి తలచుకుంటేనే ఒళ్లు జలదరించినట్లు వారు ఫీలవుతారు. అయితే ఆ వ్యక్తి మాత్రం అలా కాదు. తనను పాము కాటేసిందని తెలిసినా.. దాన్ని అతను పట్టుకుని ముక్కలు ముక్కలుగా బ్రెడ్డును కొరికినట్టు కొరికాడు. ఈ క్రమంలో అతనిప్పుడు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో ఉన్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

drunken man bite snake into pieces

ఉత్తరప్రదేశ్‌లోని ఎటవా జిల్లాలో ఉన్న ఓ గ్రామమది. అక్కడ నివాసం ఉండే రాజ్‌కుమార్ అనే వ్యక్తి జూలై 28వ తేదీన రాత్రి పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న ఓ పాము రాజ్‌కుమార్‌ను కాటేసింది. దీంతో రాజ్‌కుమార్ ఏ మాత్రం భయపడకపోగా.. ఆ పామును పట్టుకుని ముక్కలు ముక్కలుగా కొరికాడు. మద్యం సేవించి ఆ మత్తులో ఉన్న అతను తాను ఏం చేస్తున్నాడో తెలియకుండానే పామును అలా ముక్కలుగా కొరికి.. తనను అది కాటేసినందుకు గాను దానిపై అతను రివేంజ్ తీర్చుకున్నాడు.

అయితే రాజ్ కుమార్‌ను గమనించిన అతని తండ్రి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే రాజ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో వైద్యులు ప్రస్తుతం అతనికి చికిత్సనందిస్తున్నారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికులను తీవ్రమైన షాక్‌కు గురి చేసింది..!