ఇదో రకం ఆశ్రమం: సీడీలు.. డ్రైవ్ లు.. రేప్ లు.. గంజాయి ప్యాకెట్లు!

-

భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి గల కారణాల్లో మూడనమ్మకాలు.. భక్తి మైకంలో మరిచిపోతున్న విజ్ఞతలు.. ఒక ప్రధాన కారణం అని చెబుతుంటారు పెద్దలు! గాడ్ ని నమ్మండి.. గాడ్ మ్యాన్ ని కాదని ఎంతమందికి చెప్పినా.. ఎంతమంది చెప్పినా.. ఎలా చెప్పినా.. వినరు. చేతులు కాలాక ఆకులు అందించమని అడుగుతుంటారు!! పాపం అని జాలిపడాలా.. వీరి అజ్ఞానంపై ఆగ్రహం వ్యక్తం చేయాలా అనేది చాలా మందికి భారీ కన్య్ఫూజన్! ఈ క్రమంలో తాజాగా ఒక కొత్త బాబా యవ్వారం వెలుగులోకి వచ్చింది!

భారతదేశంలో అమాయకులైన భక్తులకు కొదవలేదు.. వారి అమాయకత్వాన్ని అన్ని విధాలా క్యాష్ చేసుకునే బాబాలకూ లోటు లేదు! ఈ పుణ్యదేశంలో పాపపుపనులు చేసే బాబాల సరసన తాజాగా మధ్య ప్రదేశ్ కు చెందిన ధర్మేంద్ర దాస్ చేరిపోయాడు! అవును… మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ధర్మేంద్ర దాస్ అనే వ్యక్తి తనకుతానుగా స్వామీజీగా ప్రకటించుకున్నాడు. తనదైన శైలిలో చెప్పాల్సినవి చెప్పి స్థానిక గ్రామస్తుల్ని లోబరుచుకున్నాడు. ఫలితంగా ఆశ్రమం స్థాపించాడు. అనంతరం అసలు రంగు బయటపెట్టాడు!

ఆశ్రయంలో గంజాయి దందా ప్రారంభించాడు. మత్తులో ఉన్న మహిళా భక్తులపై అత్యాచారాలకు ఒడిగట్టాడు. వాటిని షూట్ చేసేవాడు.. అనంతరం బ్లాక్ మెయిల్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకునేవాడు. ఈ విషయంలో కొందరు మహిళలు ధైర్యం చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో… ఈ దొంగ బాబా ఆశ్రయంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు… వందల సంఖ్యలో సీడీలు, పెన్ డ్రైవ్ లతోపాటు.. కిలోలకు కిలోలు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news