ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. వైద్య దంపతులు సహా ఐదుగురు సజీవదహనం

-

జార్ఖండ్ ధన్​బాద్​లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వైద్య దంపతులతో పాటు ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

fire-accident

ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అందులో వైద్య దంపతులున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటన చోటుచేసుకోవడానికి గల కారణాలను అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news