జార్ఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు చిన్నారులు దుర్మరణం

జార్ఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ స్కార్పియో వాహనం ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

బిశున్​పుర్​కు చెందిన అరవింద్ మిస్త్రీ అనే వ్యక్తి కుమారుడు వివాహ వేడుకను ఓ పంక్షన్​ హాల్​లో ఘనంగా నిర్వహించారు. అనంతరం కారులో బయలుదేరిన ఆయన రోడ్డుపై వెళ్తున్న ఐదుగురిని తన స్కార్పియోతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తిని ఎమ్​ఎమ్​సీహెచ్​కు తరలించారు.

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల ముందు స్కార్పియో డ్రైవర్ ఒక ఆవును కూడా ఢీకొట్టి చంపాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.