హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష ఖ‌రారు చేస్తూ కోర్టు తీర్పు..!!

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నల్గొండ జిల్లా హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి మర్డర్ కేసుల్లో ఈ రోజు హైర్ట్‌లో తీర్పు వెల్ల‌డైంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగ‌తి తెలిసిందే. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పోలీసులు 300 మంది సాక్షుల్ని ప్రశ్నించారు. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అయితే తాను నిర్దోషినని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు.

అతనే నేరం చేశాడని నిరూపించేందుకు డీఎన్ఏ, బ్లడ్ టెస్ట్, పోస్టుమార్టం రిపోర్టు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్… అన్నీ పక్కా ఆధారాలుగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. మ‌రోవైపు హాజీపూర్ వాసులు కూడా భారీగా కోర్టు వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఇక ఇప్పటికే హజీపూర్ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్ర‌మంలోనే జ‌డ్జ్ మూడు కేసుల్లోనూ నేరం రుజువు అయింది అంటూ కొన్ని ప్ర‌శ్న‌లు అడిగ‌గా.. నాకు ఏం సంబంధం లేదంటూ శ్రీ‌నివాస్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

కావాల‌నే నా మీద త‌ప్పుడు కేసులు పెట్టాడంటూ చెప్పుకొచ్చాడు శ్రీ‌నివాస్‌. మ‌రియు నా త‌ల్లిదండ్రుల‌ను నేనే పోషించాలి, నా ఇల్లు కూడా కూల్చేశారు అంటూ ఆరోప‌ణులు చేశాడు. దీంతో నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసా? అసలు, మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అని శ్రీనివాస్ రెడ్డిని జడ్జి ప్రశ్నించగా, తనకు తెలియదని అతను సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా హాజీపూర్ వరుస హత్యల కేసులో న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను ఖరారు చేస్తూ నల్గొండ ప్రత్యేక కోర్టు ఫైనల్ జడ్జ్‌మెంట్‌ను వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news