పానీ పూరి కోసం టాయిలెట్ లో వాటర్ వాడాడు… ఇక అంతే…!

పానీ పూరి అంటే మనకు ఎంత ఇష్టం. అసలు పాని పూరి చూస్తే చాలు కొంత మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కాని మహారాష్ట్రలో ఒక ఘటన జరిగింది. పాని పూరిలో వాడే నీళ్ళను టాయిలెట్ వాటర్ వాటర్ తో నింపాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పానీ పూరి అమ్ముతున్న ఒక వీధి వ్యాపారి… టాయిలెట్ వాటర్ ని మిక్స్ చేసాడు. కొల్హాపూర్ రంకెల లేక్ సమీపంలో అతను పాని పూరి అమ్ముతూ ఉంటాడు.

ఈ బండికి ‘ముంబై కే స్పెషల్ పానీ పూరి వాలా’ అని పేరు పెట్టారు. దీనికి మంచి పేరు కూడా ఉందట. అయితే పూరి ముంచే డబ్బాను టాయిలెట్ నీటితో నింపి ఆ తర్వాత పాని పూరిలో కలపడం ఒకరు వీడియో షూట్ చేసారు. ఈ విషయం వైరల్ కావడంతో అతనిపై దాడి చేసారు.