హైదరాబాద్​లో రూ.1.24 కోట్ల హవాలా డబ్బు పట్టివేత

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పోలీసులు భారీగా హవాలా డబ్బు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో షోయబ్‌ అనే వ్యక్తి వద్ద 1.24 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర్​ప్రదేశ్‌ మీరట్‌కు చెందిన షోయబ్‌ మాలిక్‌ హైదరాబాద్‌ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్‌ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గుజరాత్‌ గల్లీకి చెందిన భరత్‌ వద్ద తీసుకున్న నగదును షోయబ్‌ తరలిస్తుండగా.. పక్కా సమాచారంతో షోయబ్‌ నివాసంలో తనిఖీ చేసిన పోలీసులు.. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన లెక్క చెప్పకపోవడంతో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.