గత కొన్ని రోజులుగా నందిని టిక్‌టాక్ యాప్‌ను తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని… ఆ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుంది. రోజూ కొన్ని వీడియోలను అందులో పోస్ట్ చేస్తోంది. డ్యాన్స్ చేయడమో.. డైలాగ్ చెప్పడమో.. ఇలా రోజూ తన వీడియోలను యాప్‌లో పోస్ట్ చేస్తూ.. ఫాలోవర్స్‌ను కూడా బాగానే పెంచుకుంది.
ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషనే వేరు. ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్లను పట్టుకొని దాంట్లో ఏదో ఒకటి నొక్కుతూ టైమ్ పాస్ చేస్తారు. జియో పుణ్యాన ఇంటర్నెట్ కూడా చీఫ్‌గా దొరుకుతుండటంతో నేటి యువత స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. దానికి తోడు.. టిక్‌టాక్ లాంటి యాప్స్. ఇంకేముంది.. ఆ వీడియో.. ఈ వీడియో అని లేకుండా.. ఏది పడితే ఆ వీడియోను యాప్‌లో పోస్ట్ చేయడం.. లైకులు, కామెంట్ల కోసం తెగ ఆరాటపడటం.. ఇదే నేటి యూత్ పని.
అయితే.. ఇటువంటి యాప్స్ వల్ల మనిషి మంచి జరగడం పక్కన పెట్టండి.. కాపురాలు కూలిపోతున్నాయి. కొందరైతే ఏకంగా అనుమానంతో చంపేయడానికి కూడా వెనుకాడటం లేదు.
అటువంటి ఘటనే ఒకటి తమిళనాడులోని కోవైకి దగ్గర్లోని అరివొలినగర్‌లో చోటు చేసుకున్నది. 35 ఏళ్ల కనకరాజుకు, కాలేజీలో పనిచేసే నందినికి కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
అయితే.. రెండేళ్ల కింద కనకరాజు, నందిని మధ్య వచ్చిన గొడవ కారణంగా ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా నందిని టిక్‌టాక్ యాప్‌ను తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని… ఆ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుంది. రోజూ కొన్ని వీడియోలను అందులో పోస్ట్ చేస్తోంది. డ్యాన్స్ చేయడమో.. డైలాగ్ చెప్పడమో.. ఇలా రోజూ తన వీడియోలను యాప్‌లో పోస్ట్ చేస్తూ.. ఫాలోవర్స్‌ను కూడా బాగానే పెంచుకుంది.
అయితే.. ఈ విషయం తన భర్త కనకరాజుకు తెలిసింది. టిక్‌టాక్‌లో వీడియోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు.. పోస్ట్ చేయకు అని నందినిని వారించాడు. కానీ.. నందిని వినలేదు. రోజూ నందిని పోస్టులు చేస్తూనే ఉన్నది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన కనకరాజు మద్యం సేవించి.. నందిని పనిచేసే కాలేజీకి వెళ్లి తనతో గొడవ పెట్టుకున్నాడు. వీళ్ల మధ్య గొడవ పెరిగి పెద్దదయింది. వెంటనే ఆవేశంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో నందినిని పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తిగాట్లకు తీవ్రంగా గాయపడిన నందిని.. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది.