నన్ను మన్నించండి.. మిమ్మల్ని నిరాశపరుస్తున్నా: హరీశ్ రావు

-

సాధారణంగా ఆయన పుట్టిన రోజును హరీశ్ రావు అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. హరీశ్‌రావును ప్రత్యేకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేస్తారు. రక్తదానం, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.

జూన్ 3న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పుట్టిన రోజు. అయితే.. ఈసంవత్సరం పుట్టిన రోజు వేడుకలకు తను దూరంగా ఉంటున్నట్టు హరీశ్ రావు తెలిపారు. తన అభిమానులకు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల కోసం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు(జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్‌లో కాని, సిద్దిపేటలో కాని ఉండటం లేదు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటూ.. మీ అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నా.. మీ హరీశ్ రావు అంటూ పోస్ట్ పెట్టారు హరీశ్ రావు.

సాధారణంగా ఆయన పుట్టిన రోజును హరీశ్ రావు అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. హరీశ్‌రావును ప్రత్యేకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేస్తారు. రక్తదానం, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. కానీ.. ఈసారి మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల హరీశ్ రావు వేరే చోటుకు వెళ్తుండటంతో.. తన అభిమానులను ఉద్దేశించి ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news