యూట్యూబ్ లో చూసి బిడ్డకు జన్మనిచ్చిన బాలిక..ప్రియుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

-

ఈ మధ్య మైనర్ల తాలుకూ నేరాలు ఎక్కవైపోతున్నాయి. సరిగ్గా స్కూల్స్ లేకపోవటం..ఆన్ లైన్ లోనే అంతా ఎడ్యూకేషన్ అయిపోవటం కారణంఏమో కానీ..చిన్నచిన్నపిల్లలే ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. ఒకడు యూట్యూబ్ లో చూసి దొంగతనాలు నేర్చుకుంటే..ఇప్పుడు ఇంకో మైనర్ బాలిక ఏకంగా యూట్యూబ్ లో చూసి బిడ్డకు జన్మనిచ్చింది. ఇలాంటి కంటెంట్ యూట్యూబ్ లో అసలు ఎందుకు పెడతారో తెలియదు. ఏదో అవగాహన కోసం పెట్టి ఉంటారేమో..అది కాస్త ఇలా ఉపయోగించింది ఈ బాలిక.. అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. తల్లికి కళ్లు కనిపించవు. తండ్రి సెక్యురిటీ గార్డుగా పనిచేస్తాడు. ఈ బాలిక ఇక పక్కింట్లో ఉండే 21ఏళ్ల యువకుడితో ప్రేమాయణం నడిపింది. ఇద్దరు శారీరకంగా కూడా ఒకటయ్యారు. కట్ చేస్తే బాలిక గర్భం దాల్చింది. పాపం ఆ గుడ్డి తల్లికి ఇదేమి తెలియదు. పోనీ తండ్రి ఏమైనా చూశాడా అంటే..ఎక్కువ రాత్రిపూట విధులు నిర్వర్తిస్తూ ఇంటికి పెద్దగా వచ్చేవాడు కాదట.

ఈ క్రమంలోనే బాలికలకు నెలలు నిండాయి. గత నెల 20న బాలిక ఇంట్లోని గదిలోకి వెళ్లి యూట్యూబ్ లో చూసి పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. వీడియో చూస్తూ.. బొడ్డుతాడును కత్తిరించుకుంది. ఈ విషయం రెండు రోజుల వరకు బాలిక తల్లిదండ్రులకు తెలియలేదు. ఓ రోజు బాలుడు ఏడవడంతో విషయం బాలిక తల్లికి తెలిసింది.

బాలికకు, బిడ్డకు ఇన్ఫెక్షన్ కూడా అయింది. బాలిక తల్లి కూతురును మందలించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని మలప్పురం జిల్లా శిశు సంక్షేమ కమిటీకి చెప్పారు. అక్కడినుంచి విషయం పోలీసులకు తెలిసింది. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చడానికి కారణమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇలా తల్లిదండ్రులు బలహీనత వల్ల ఆ మైనర్ బాలిక తన జీవితాన్ని పాడుచేసుకుంది. కూతురు ఇలా చేసింది ఆ తల్లి కన్నీరుమన్నీరుగా విలపిస్తోంది. ఇప్పుడు ఆ పసిబిడ్డు పరిస్థితి ఏంటో.

Read more RELATED
Recommended to you

Latest news